ఎమ్మార్‌ కేసులో మరో 43కీలక పత్రాలు సేకరించాం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో మరో 43 కీలక పత్రాలు సేకరించినట్లు కోనేరు బెయిల్‌ పిటిషన్‌పై వాదనల్లో సీబీఐ పేర్కొంది. ఈకేసులో మరో 8మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామని సీబీఐ పేర్కొంది. విల్లాల అమ్మకాలతో అర్జించిన సొమ్మును సౌత్‌ఎండ్‌ సంస్థకు మళ్లించారని, సునీల్‌ రెడ్డికి చెందిన ఈ సంస్థలోకి రూ.36కోట్లు మళ్లినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. ఈకేసులో మరో నిందితుడిని ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ తెలిపింది. విల్లాల అమ్మకం ద్వారా అర్జించిన సొమ్మును పక్కదారి పట్టించడంలో అతనిది కీలకపాత్ర అని, ఇందులో భాగంగానే కోనేరు ప్రసాద్‌ ఆడిటర్‌ సురేంద్ర వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశామని సీబీఐ తెలిపింది. ఎమ్మార్‌ కేసులో రూ.45.41కోట్లకు సంబంధించి అంతిమ లబ్ధిదారులు ఎవరన్నదానిపై దర్యాప్తు చేస్తున్నామని, దుబాయిలో ఉన్న ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ సీఈవో శ్రీకాంత్‌ జోషిని కూడా పట్టుకోవాల్సి వుందని సీబీఐ న్యాయస్థానానికి తెలియజేసింది.