ఎమ్మెల్యే కవితకు చేదు అనుభవం
హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సదస్సులో మహబూబాబాద్ ఎమ్మెల్యే కవితకు చేదు అనుభవం ఎదురైంది. వేదిక వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా ఆమెను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి వేదికకు దూరంగా భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.