ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి
ఎస్ ఐ వెంకటరెడ్డి హుజూర్ నగర్ సెప్టెంబర్ 28(జనం సాక్షి): ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని హుజూర్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ కె. వెంకట్ రెడ్డి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కరణ్ కుమార్ అన్నారు. బుధవారం హుజూర్ నగర్ పట్టణం లింగగిరి రోడ్డు లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఫార్ బాయిల్డ్ రైస్ మిల్ కార్మికులకు హెచ్ ఐ వి, ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం, అనంతరం పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకరికంటే ఎక్కువమందితో సంభోగంలో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుందనీ అన్నారు. ఏ ఆర్ టి మందుల వాడకం ద్వారా వ్యాధిగ్రస్తులు జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చన్నారు. ఎయిడ్స్‌గల వారితో కలిసిమెలిసి జీవించడం వల్ల, ఎయిడ్స్‌పీడితుల సంరక్షణ బాధ్యత వహించేవారికి ఆ కారణంగా ఇది సోకడం జరగదన్నారు. హెచ్‍ఐవి/ఎయిడ్స్ ఉన్నవారితో కలసి పనిచేయడం వలన సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఎంతమాత్రం లేదన్నారు. ఈ శిబిరం నందు 60 మంది పురుషులు, 10 మంది స్త్రీ కార్మికులకు పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ సి టి సి కౌన్సిలర్ విజయ్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ సిద్ధూ,
రాం మోహన్, రైస్ మిల్ యజమానులు ప్రభాకర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.