ఎర్రచందనం పట్టివేత

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురం సమీపంలోని చందమామపల్లె వద్ద 15 టన్నుల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శేషాచల అడవుల నుంచి తమిళనాడుకు భారీ కంటేనర్‌ లారీలో వీటిని తరలిస్తుండగా పట్లుకున్నారు. వీటి విలువ సుమారు. రూ. 4 కోట్లు ఉంటుందని అధికారులు, అంచనా వేస్తున్నారు. అధికారులను చూసిన  వెంటనే స్మగ్లర్లు వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు.