ఎవరు ఎక్కడైన పర్యటించవచ్చు: తెదేపా

హైదరాబాద్‌: వైఎస్‌ విజయమ్మ పర్యటనపైతెలుగేశం పార్టీది ప్రజాస్వామ్య వైఖరేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చన్నారు. అదే విధంగా ఆ ప్రాంత ప్రజలు తమ మనోభావాలకు అనుగుణంగా పార్టీ వైఖరీ స్పష్టంవ చేయమని నిరసన తెలిపే హక్కూ ఉంటుందన్నారు. అయితే ఆ నిరసనలు హింసాత్మకంగా ఉండకూడదు అనేది తెలుగుదేశం విధానమన్నారు. దాడులు చేయకుండా, హింసాకాండకు పాల్పడకుండా ప్రశ్నించాలని సూచించారు.