ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుళ్ల అభ్యర్థులహాల్‌ టికెట్ల పంపిణీ

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి):

వచ్చే నెల 17 వ తేదీన జరగనున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్షకు సంబంధించి ఇప్పటివరకు హాల్‌ టికెట్లు తీసుకోని అభ్యర్థులు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సంప్రదించాలని ఎస్పీ కెవీవీ గోపాలరావు తెలిపారు. సంబంధిత అర్హత పత్రాలు చూపించి హాల్‌ టికెట్లు పొందవచ్చన్నారు. అభ్యర్థులు ఎవరైనా ఉర్దూలో పరీక్ష రాయదల్చుకుంటే ఈ నెల 30లోగా ఎస్పీ కార్యాలయంలో చెప్పాలన్నారు.

ప్రభుత్వ పథకాల అమలులో సీతంపేట ఐటీడీఏ ప్రత్యేక గుర్తింపు పొందిందని ఐటీడీఏ పీఓ సునీల్‌రాజ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పాలకొండలో ఆయన మాట్లాడుతూ త్వరలో అన్ని శాఖలను సమన్వయం చేసి గిరిజనులకు మెరుగైన సేవలందించి ప్రభుత్వ పథకాలు చేరువ చేస్తామన్నారు. తనపై ఎలాంటి అభియోగాలు, ఆరోపణలు లేవన్నారు. పది ఐటీడీఏలలో మూడు చోట్ల మాత్రమే అధికారులు ఉన్నారని, మిగిలిన ఏడు చోట్ల గ్రూపు-1 అధికారులు పని చేస్తున్నారన్నారు. ఏడు ఐటీడీఏ పీఓలతో పోల్చితే తానే సీనియర్‌ను అని అన్నారు. సొంత జిల్లాలో పనిచేసేందుకు ముఖ్యమంత్రి అనుమతి పొంది ప్రత్యేక జీఓతో సీతంపేట ఐటీడీఏ పీఓగా విధుల్లో చేరానన్నారు. డిప్యూటీ డీఈఓగా వివి సూర్యనారాయణ సీతంపేటలో కొనసాగిందుకు తాను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. ఐటీడీఏలో ఐకేపీ, ఉపాధి హామీ పనుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.