ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక సదస్సు ప్రారంభం

విజయవాడ: ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై జిల్లా స్థాయి సదస్సు విజయవాడ సిద్ధార్ధ ఆడిటోరియంలో ఈ రోజు ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, శైలజానాథ్‌, కొండ్రు మురళీమోహన్‌, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పార్థసారధి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలు ఎస్సీ ఎస్టీలకు చేరువయ్యేందుకు తీసుకోవలసిన చర్యలను అధికారులకు వివరించారు. ఈ రోజు సాయంత్రం వరకు ఈ సదస్సు జరుగుతుంది.