ఎస్సీ ఎస్టీ నిధుల సక్రమ అమలు కోసం నోడల్‌ ఏజెన్సీ

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ నిధుల సక్రమ అమలుకోసం ఓ నోడల్‌ ఏజెన్సీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయం ద్వారా 40 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించిన చట్టాన్ని ఆమోదింపచేసెకునేందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని సభ్యులు నిర్ణయించారు. సచివాలయంలోని ఉపముఖ్యమంత్రి ఛాంబర్‌లో ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మూడో దశ జిల్లా పర్యటనలు త్వదలోనే చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేయనున్నారు. ప్రత్యేక చట్టం ద్వారానే నిధుల పక్కదారి పట్టకుండా అడ్డుకోగలమని మంత్రి బాలరాజు అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్‌తో పాటు ఇతర మౌలిక అవసరాలకు దాదాపు 4వేల కోట్ల రూపాయలు కేటాయించేందుకు గత సమావేశంలో ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. ఎస్సీలకు 2900 కోట్ల రూపాయలు, గిరిజనులకు 1590 కోట్ల రాపాయల మేర వచ్చే రెండేళ్ళలో ఖర్చు చేయనున్నారు.