ఎస్సీ వర్గీకరణకు తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుంది:బాబు

హైదరాబాద్‌:  ఎస్సీ వర్గీకరణకు తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుందని, పోలీట్‌ బ్యూరో సమావేశ అనంతరం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రం వెంటనే రాజ్యాంగా సవరణ చేయాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం వేసిన కమీటిలన్ని వర్గీకరణకు అనుకూలంగానే నివేదికలు ఇచ్చాయని అన్నారు. వర్గీకరణ కోసం కేంద్రానికి వెంటనే లేఖ రాయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.