ఏఎఫ్‌ఆర్‌సీకి అఫిడవిట్లు సమర్పించని ఇంజనీరింగ్‌ కాలేజిలకు మరో అవకాశం

హైదరాబాద్‌: ఏఎఫ్‌ఆర్‌సీకి అఫిడవిట్లు సమర్పించని ఇంజనీరింగ్‌ కాలేజిలకు మరో అవకాశం కల్పించారు. రేపటినుంచి వారు అఫిడవిట్లు దాఖలు చేయవచ్చు ఫీజుల పెంపు గందరగోళంతో తాము అండర్‌ టేకింగ్‌ పత్రాలను అందించలేకపోయాని గడువు కావాలని కళాశాలలు కోరటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత మండలీ అధ్యక్షుడు జయమప్రకాశ్‌రావు తెలిపారు. శనివారం రాత్రితో ముగిసిన అఫిడవిట్ల సమర్పణ గడువు ప్రకారం 35వేల ఫీజు ఒప్పుకుంటూ అండర్‌టేకింగ్‌ ఇచ్చిన కాలేజీ వివరాలతో ఏఎఫ్‌ఆర్‌సీ నివేదిక సమర్పించింది. ఇందులో 483 ఇంజనీరింగ్‌ కాలేజీలతో సహ 934 కాలేజీలున్నాయి. 29నుంచి వెబ్‌ కౌన్సిలింగ్‌, 26వరకు అఫిడవిట్లను స్వీకరిస్తారు. పెంచిన గడువుతో 50కాలేజీలకు ప్రతిపాదనలస్తాయని ఏఎఫ్‌ఆర్‌ తెలిపింది.