ఏఐఎన్‌ఎఫ్‌ ఆందోళన

హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఏఐఎన్‌ఎఫ్‌ శుక్రవారం ఆందోళన చేపట్టింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేయాలని ఏఐఎన్‌ఎఫ్‌ డిమాండ్‌ చేస్తోంది. డీఈఓ, ఎంఈఓ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఏఐఎన్‌ఎఫ్‌ కార్యకర్తలు కోరుతున్నారు. ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.