*ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా సంగీభావం ప్రకటించిన మెట్పల్లి కాంగ్రెస్ నాయకులు*
మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 07
(జనం సాక్షి)
ఏఐసిసి నేత రాహుల్ గాంధీ నేడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కోరుట్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంఘీభావం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఆదేశాల మేరకు నేడు మెట్పల్లిలోని ఆయన నివాసము పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎన్ ఎస్ యు ఐ సీనియర్ నాయకులు కాజా అజిమ్ మాట్లాడుతూ.. ప్రజల కోసం దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో అఖండ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని, కనుక కార్యకర్తలుగా మనమందరం రాహుల్ గాంధీకి సంఘీభావ సూచనగా రీ ట్వీట్ చేస్తూ అలాగే ప్రతి కార్యకర్త విధిగా మరో 10 మంది చే రి ట్వీట్ చేయించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎండి రైసోద్దిన్ దోనోజు వెంకటేష్, మోహిష్, అప్రోజ్, ప్రణయ్ తేజ, బర్ల వంశీ ,అర్జున్ అజారుద్దీన్, పల్లికొండ ప్రవీణ్, కంతి హరి కుమార్, మూఈస్ అన్వర్, రమేష్ ,మహేష్ ,రఘు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు