ఏకీకృత ఫీజు విధానాన్ని అమలుచేయాలి: పీడీఎన్‌యూ

హైదరాబాద్‌: ప్రైవేటు మెడికల్‌, ఇంజినీరింగ్‌ ఇతర వృత్తివిద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలపి డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు నోముల శేషు, సిద్ధంకి రమణాకర్‌, తిరుమలరావులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఫీజుల పెంపుదలను నిలిపేసి ఫీజు రియంబర్స్‌మెంట్‌ను యధావిధిగా నిర్వహించాలన్నారు. ఏకీకృత విద్యావిధానాన్ని, ఫీజులను అమలుచేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.