ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట తెదేపా ధర్నా

ఏలూరు: ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట తెదేపా ధర్నా  ఉండి ఎమ్మెల్యే కె.శివరామరాజు మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించగా, ధర్నాలో దేశం ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌రావు, జయమంగళ వెంకటరమణ, దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం కలెక్టరేట్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ముందుగా అనుమతి తీసుకున్నప్పటికీ వినతి పత్రం తీసుకునేందుకు ఆమె గానీ ఇతర ఉన్నతాధికారులు గానీ అందుబాటులో లేకపోవడం ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురయ్యారు. ఎమ్మెల్యేలు ముగ్గురు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నేలపైనే పడుకున్నారు. అధికారులు వచ్చే వరకు తమ నిరసన కొనసాగుతుందని తెలిపారు.