ఏసీబీకి చిక్కిన కె.కోటపాడు కార్యదర్శి

కె. కోటపాడు : విశాఖ జిల్లా కె.కోటపాడు పంచాయితీ కార్యదర్శి సుగుణేశ్వరరావు సోమవారం రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.కె.కోటపాడుకు చెందిన గెడ్డం మధు సోదరుడు నాని ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని మరణ ధృవపత్రం కావాలని మధు గత నెల 30న దరఖాస్తు చేసుకున్నాడు. తనకు రూ. 20వేలు లంచం ఇస్తే థృవపత్రం ఇస్తానని చెప్పగా మధు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారిచ్చిన సలహా మేరకు మధు తన ఇంటి వద్దకు వచ్చిన కార్యదర్శికి  రూ. 15 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ ఎన్‌. వెంకటేశ్వరరావు పట్టుకుని అరెస్టు చేశారు.

తాజావార్తలు