ఏ నిబంధనలకింద బొగ్గు గనులు కేటాయించారు? :కేంద్రానికి సుప్రీం ప్రశ్న
ఢిల్లీ : కేంద్రం ఏ నిబంధనల కింద బొగ్గు గనులు కేటాయించిందో తెలపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మైన్స్ అండ్ మినరల్స్ చట్టం బొగ్గు గనులను కేటాయించే పని రాష్ట్రాలకే అప్పగించిందని, దాన్ని కేంద్రం లెక్కచేయకపోవడం తగదని న్యాయస్థానం అభిప్రాయపడింది. జస్టిన్ లోధా, జస్టిస్ చలమేశ్వర్లతో కూడిన ధర్మాసనం కోల్మైన్స్ యాక్టను పరిశీలించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. ఎంఎల్ శర్మ అనే న్యాయవాది దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వెలిబుచ్చింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలపై నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలియజేసింది.