ఐసిడిఎస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మల్దకల్ మార్చి 3 (జనంసాక్షి) మండల కేంద్రంలోని అంగన్వాడి ఐసిడిఎస్ కార్యాలయంలో మల్దకల్ ప్రాజెక్ట్ జరిగిన సెక్టార్ స్థాయి సమావేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.హెల్ప్ లైన్ 181,100,1098 ల గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి, మహిళల రక్షణ కోసం తమ వంతు సహాయం అందించాలని సూచించారు.అంగన్వాడి టీచర్స్ ఎప్పటికప్పడు ఆన్లైన్ లో నమోదు చేయాలి,రిజిస్టర్ లలో అన్ని ఎప్పటికప్పడు పూర్తిగా నమోదు చేసి ఉండాలి,ప్రీ స్కూల్ సిలబస్ ప్రకారం నిర్వహించాలి,తీవ్ర లోప పోషణ గల పిల్లలను గుర్తించి వారి తల్లదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలి అని సిడిపిఓ కమలాదేవి టీచర్స్ కు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ లు నాగరాణి, బాలమ్మ,యామిని,వాసంతి ఐజ,మల్దకల్,గట్టు మండలాల అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.
Related