ఒంటిమిట్ట పీఎస్‌లో ఎర్రచందనం దుంగలు మాయం

కడప: జిల్లా ఒంటిమిట్ట పోలీస్‌స్టేషన్‌లో దొంగతనం జరిగింది. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పట్టుకున్న పోలీసులు.. పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచారు. గురువారం అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఎర్రచందనం దుంగలలోని కొన్ని దుంగలను దొంగలు ఎత్తుకెళ్లారు.