ఓబీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో వీహెచ్‌కు సన్మానం

హైదరాబాద్‌: పెరియార్‌ సంస్థ వీరమణి అవార్డు ఇచ్చిన సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావును ఓబీసీ మేధావుల ఫోరం హైదరాబాద్‌ జూబ్లీహాల్‌లో సన్మానించింది. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.ఎన్‌. రావు, మంత్రి సారయ్య, భాజపా నేత దత్తాత్రేయ తదితరులు కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ద్వారా లబ్దిపొందిన వారే పార్టీని విమర్శిస్తున్నారు. దళిత, గిరిజనుల్లాగానే బీసీలకు కూడా పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.