ఓయూలో విజయశాంతి జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌:ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ అధికార ప్రతినిది జగన్‌ ముదిరాజ్‌ ఆద్వర్యంలో తెరాస ఎంపీ విజయశాంతి 46వ జన్మదిన వేడువలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో 46 మంది విద్యార్ధులు రక్తదానం చేశారు.విజయశాంతి వచ్చే పుట్టిన రోజు వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.