ఔటర్‌ రింగురోడ్డుపై ప్రమాదం: వైద్య విద్యార్థి మృతి

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ సమీపంలో ఔటర్‌ రింగురోడ్డుపై వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన విద్యార్థులపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌ వైద్యకళాశాల విద్యార్థులుగా గుర్తించారు.