కంటివెలుగుకు సిద్దమైన సర్కిళ్లు
మూడు సర్కిళ్ల అధికారలు సవిూక్ష
హైదరాబాద్,ఆగస్ట్14(జనం సాక్షి): ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి జిహెచ్‌ఎంసి సిద్దం అయ్యింది. ఈ మేరకు కావాలసిన ఏర్పాట్లు చేశారు. హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ జీహెచ్‌ఎంసీ సర్కిళ్ల అధికారులు. ఏర్పాట్లను ఈస్ట్ జోన్ కమిషనర్ శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించారు. ఏర్పాట్లలో భాగంగా చైతన్యపురి డివిజన్ లో అధికారులు, స్థానిక కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి తో ఏర్పాటు చేసిన సవిూక్షా సమావేశం నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సూచనలు చేశారు. ఎక్కడ ఎక్కవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఇలాంటి అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ ఈస్ట్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సరూర్ నగర్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య, కార్పొరేటర్ విఠల్ రెడ్డి తెలిపారు.


