కంటి వెలుగు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బృహత్తర కార్యక్రమం.
.
జడ్పిటిసి ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్….
జనం సాక్షి/ కొల్చారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని. కొల్చారం మండల జడ్పిటిసి ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్ అన్నారు.. బుధవారం నాడు తమ అశ్వంత గ్రామమైన వరిగుంతంలో.. కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని.. దూరం చూపు దగ్గర చూపు వెంటనే కంటి అద్దాలను.. వైద్య సిబ్బంది అందిస్తున్నారని.. ఇంకా ఇతర కారణాలు ఉంటే… క్యాంప్ నిర్వహించి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు… ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బందితోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు. ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.