కళాశాల బస్సు బోల్తా .. విద్యార్థులకు తీవ్రగాయాలు

విశాఖ : అచ్చుతాపురం మండలం కొండకార్లా జంక్షన్‌ సమీపంలో ఈ ఉదయం ఓ కళాశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్తున్న నేషనల్‌ జూనియర్‌ కళాశాల బస్సు ముందున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థులను అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.