కాంగ్రెస్‌కు శస్త్రచికిత్స జరగాల్సిందే దిగ్విజయ్ సింగ్

ఫలితాలు నిరాశపరిచాయని అయితే ఈ అపజయం వూహించనిది కాదన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 543 సీట్లకుగాను కాంగ్రెస్‌కు కేవలం 44 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. అంతటి పేలవ ప్రదర్శన తర్వాత కూడా పార్టీలో ఎలాంటి కీలక మార్పులూ జరగలేదని ఆయన చెప్పారు. ఏఐసీసీలో భారీగా మార్పులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. తర్వాత పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అవ్వాలన్న అర్థంలోనూ ఆయన మాట్లాడారు. పార్టీ ఇంకా ఎంత కాలం ఆత్మపరిశీలన చేసుకోవాలో ఆలోచించుకోవాలని నష్టనివారణ చర్యలు చేపట్టాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.