కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల

శ్రీకాకుళం,మార్చి19(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ సోమవారం అర్ధరాత్రి ప్రకటించింది. జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల చేశారు.
ఇచ్ఛాపురం నియోజకర్గానికి కొల్లి ఈశ్వరరావు, పలాసకు మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద, టెక్కలికి చింతాడ దిలీప్‌కుమార్‌, నరసన్నపేటకు డోల ఉదయభాస్కర్‌, పాతపట్నంకు బాణ్న రాము, ఆమదాలవలసకు మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, రాజాంకు కంబాల రాజ్‌వర్ధన్‌, పాలకొండకు హిమరాక్‌ ప్రసాద్‌, ఎచ్చెర్లకు కొత్తకోట్ల సింహాద్రినాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గానికి చౌదరి సతీష్‌లను అభ్యర్థులుగా వెల్లడించింది.