కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ

వరంగల్‌:  జిల్లాలోని మరిపెడ మండలం తాళ్లవూకల్లులో మంగళవారం రాత్రి కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రామన్న అనే తెదేపా కార్యకర్త మృతిచెందాడు. పాతకక్షల నేపధ్యంలోనే ఇరుపార్టీల మధ్య ఘర్షణ తలెత్తినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో భారీగా బలగాలను మోహరించారు.