కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించిన ములాయం,మమత

న్యూడిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి అంశం లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ప్రతిపాదనను సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తిరస్కరించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అంశం పై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతోబేటీ అనంతరం మమత ములాయంతో సమావేశమయ్యారు. వీరాద్దరి భేటీలో ముగ్గురి పేర్లను ప్రతిపాదించారు. అబ్ధుల్‌ లాం,మన్మోహన్‌సింగ్‌, సోమనాధ్‌ ఛటర్జీ పేర్లను ప్రతిపాదించినట్లు భేటి అనంతరం ములాయం తెలిపారు.