*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 13 వర్ధంతి వేడుకలు*
గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (2):* కాంగ్రెస్ పార్టీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు ఫీజు రీయింబర్స్ మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, పథకాల ను పేద ప్రజలకు అందుబాటులో తెచ్చారు అని వారన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కొంకి వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు, గోపాల్పేట గ్రామ అధ్యక్షులు శివన్న, గ్రామ యూత్ అధ్యక్షులు ఎండి బాలపీర్, చాకల్ పల్లి గ్రామ అధ్యక్షులు వెంకటయ్య, జిల్లెల్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి, వార్డ్ మెంబర్ డీలర్ వెంకటయ్య, పూసల లక్ష్మణ్, దేవరాజ్ యాదవ్, శాంతయ్య, వెంకటేష్, శీను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు