కాకినాడలో పర్యటిస్తున్న సీఎం

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమారరెడ్డి ఈ రోజు కాకినాడలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి పళ్లంరాజు స్వగృహంలో ఉదయం సీఎం అల్పాహార విందుకు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. సీఎం వెంట స్థానిక నేతలు, అధికారులు ఉన్నారు.