కార్పోరేట్‌ విధానాన్ని ఉపసంహరించాలి

హైదరాబాద్‌, జనంసాక్షి: సమగ్ర వ్యవసాయ అభివృద్ధి పేరిట ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన కార్పొరేట్‌ వ్యవసాయం సేద్యాన్ని నాశనం చేస్తుందని వ్యవసాయరంగ నిపుణులు, రైతుసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేట్‌ వ్యవసాయంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. వచ్చే ఖరీఫ్‌ నుంచి దేశంలోని 17 రాష్ట్రాంలోని 8 జిల్లాలో ప్రవేశపెట్టే ఈ కార్పొరేట్‌ వ్యవసాయ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రైతుసంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పంపిణీ వ్యవసాయాన్ని విరమించుకోవాలని, రైతును ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. రైతు భాగస్వామ్యం లేకుంవడా ప్రభుత్వాలు రైతును వ్యవసాయం నుంచి దూరం చేసి భూమిని కార్పొరేట్‌ శక్తులకు అప్పజెప్పాస్తున్నాయన్నారు. రు. ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ కె.ఆర్‌ చౌదరి, వ్యవసాయ రంగ శాస్త్ర వేత అరిబండ ప్రసాద్‌రావు , అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షులు వంగల సుబ్బారావు, ఏపీ రైతు కూలీసంఘం అధ్యక్షులు కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
‘మంత్రికి ముడుపులు ఇచ్చామనడం అవాస్తవం’
హిమాయత్‌నగర్‌, జనంసాక్షి: అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టు లెక్చరర్స్‌గా తాము పడుతున్న ఆవేదనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం తమపట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న దశలో మంత్రి పార్థసారథికి మా నుంచి ముడుపులు ముట్టాయని జేఎల్‌ సాధన సమితి ఆరోపణులు చేయడం అత్యంత బాధాకరమని ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సమితి పేర్కొంది. మంగళవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో కాంట్రాక్టు అధ్యాపకుల సమితి ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ కార్యవర్గ సభ్యులతో మీడియాతో మాట్లాడారు. తాము రాష్ట్రంలోని ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా పనిచేసి ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచామన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తమ పట్ల సానుకూలంగా స్పందిచిన దశలో ఆరోపణలు చేయడం కుట్రపూరిరతమేనన్నారు. సంంతోష్‌రావు, సంగీత శ్రీనివాస్‌రెడ్డి కురుమూర్తి, ఖాసింఅలీబేగ్‌, లక్ష్మణరావు పాల్గొన్నారు.