కాలాను గుణంగా మార్పు చెందుతున్న తపాలా శాఖ

కాలాను గుణంగా మార్పు చెందుతున్న తపాలా శాఖ

పెనుబల్లి, మార్చ్ 18(జనం సాక్షి)తపాలా శాఖ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు కాలానుగుణంగా ఎన్నో మార్పులు చెందుతూ, వస్తుందని సత్తుపల్లి సబ్ డివిజన్ ఇన్స్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు,శనివారం పెనుబల్లి పోస్ట్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఎన్నో సేవలు పథకాలు ప్రజలకు అందజేస్తూ, నేటికీ కూడా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న ఏకైక సంస్థగా భారత తపాల శాఖ నేడు సమాజంలో ప్రజల మనసుల్లో నిలిచిపోయిందనిఅన్నారు, అటువంటి భారత తపాలా శాఖ భారత దేశంలో మొట్టమొదటిసారిగా (1884)లో  ప్రవేశపెట్టబడిన తపాలా జీవిత భీమా (పి.యల్.ఐ) ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉండేదని. కానీ ఇక నుండి డిగ్రీ కానీ డిప్లొమా కానీ చదివిన ప్రతి ఒక్కరు తపాలా జీవిత భీమా తీసుకోవచ్చు  తెలిపారు. ఈ భీమా పథకంలో మిగిలిన కార్పొరేట్ సంస్థలతో పోలిస్తే తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ పొందవచ్చు అని అన్నారు,  ఈ భీమా పథకంలో లోన్, అసైన్మెంట్, ఉచితంగా నామినేషన్ మార్పు, కన్వర్షన్, రివైవల్, ఇన్కమ్ టాక్స్, మినహాయింపు వంటి అనేక రకాల సదుపాయాలు ఉన్నాయ ని అన్నారు. క్లైమ్ సెటిల్మెంట్  కూడా తొందరగా సులువుగా అవుతుందని  తెలిపారు. ఈ పథకంలో చేరడానికి అర్హత లేని వారికి గ్రామీణ తపాలా జీవిత భీమా పథకం అందుబాటులో ఉందని తెలియజేసారు. ఈ మార్చి నెలలో పాలసీ ప్రారంభించినట్లయితే ఈ వార్షిక సంవత్సరం బోనస్ అదనంగా పొందే అవకాశం ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని 19 నుండి 55సంవత్సరాల లోపు వయసు ఉన్నవారందరూ వినియోగించుకోవాలని  కోరారు, తపాల శాఖలో ఆర్డి, ఎస్ బి, సుకన్య సమృద్ధి యోజన, టైం డిపాజిట్, ఆన్లైన్ పేమెంట్ యాప్ అకౌంట్ అయినటువంటి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనేటటువంటి అనేక సదుపాయాలు, పథకాలు తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని అన్నారు, సమాజంలోని ప్రతి ఒక్కరూ పోస్ట్ ఆఫీస్ లో ఏదో ఒక ఖాతా పొంది ఉండటం చాలా అవసరమని  తెలియజేశారు.