కాలువ పూడికతీత పనులు ప్రారంభించిన సర్పంచ్.


నెన్నెల, మార్చ్ 21, (జనంసాక్షి )
నెన్నెల మండలంలోని గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ మంగళవారం మత్తడి వాగు ప్రాజెక్టు కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. వారం రోజుల క్రితం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతులు కాలువ పూడికతీత పనులు చేపట్టాలని వినతి పత్రం ఇవ్వగా స్పందించిన సర్పంచ్ ఇరిగేషన్ అధికారులను సంప్రదించారు. ఇరిగేషన్ అధికారులు ఈ ఏడాది పూడికతీత పనులు చేపట్టలేము అని తెలపడంతో స్థానికంగా పనులు నిర్వహిస్తున్న మెఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వారి సహాయం తీసుకొని పూడికతీత పనులు ప్రారంభించారు. పనులు కాలువ మరమ్మత్తు పనులు ప్రారంభం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో సింగల్ విండో మాజీ చైర్మన్ ఇందూరి రమేష్, రైతులు పాల్గొన్నారు.