కిషన్ రెడ్డి ఇంటి ముందు మాదిగ డప్పుల దండోరాతో నిరసన కరపత్రం విడుదల.
ఎస్సీ వర్గీకరణకై మూడు దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం.
తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు31(జనంసాక్షి):
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లులకు చట్టబద్ధత కల్పించడంలో నిర్లక్ష్య వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 19న కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి ఇంటి ముందు మహా ఎంఆర్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్యపాగ నర్సింగ్ రావు మాదిగ,తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డ యాదయ్య మాదిగ ల ఆధ్వర్యంలో మాదిగ డప్పుల దండోరాతో నిరసన కార్యక్రమం చేపట్ట నున్నట్లు తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ తెలి
పారు.బుదవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణం లో అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ దండోరా తాలూకా అధ్యక్షుడు రాముడు మాదిగ ఆధ్వర్యంలో
కిషన్ రెడ్డి ఇంటి ముందు మాదిగ డప్పుల దండోరాతో నిరసన కరపత్రం విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మీసాల రాము మాదిగ మాట్లాడుతూ మూడు దశబ్దాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటంలో ఎంతోమంది మాదిగలు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దండోరా సభలలో, చాలా సందర్భాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్ లో చట్టబద్ధ కల్పిస్తామని, ఎస్సీ వర్గీకరణ చేసేది బిజెపి పార్టియే అని, అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతామని అనేక సందర్భాల లో నమ్మించి మాదిగలను మోసం చేసినందుకు 19న మహా ఎంఆర్పీస్, తెలంగాణ దండోరా మరియు తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి ఇంటి ముందు మాదిగ డప్పుల దండోరాతో నిరసన తెలియజేస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మూరి రాముడు మాదిగ, తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి మంతటి గోపి మాదిగ, తెలంగాణ దండోరా కొల్లాపూర్ తాలూకా నాయకులు రాజగోపాల్, జిల్లా నాయకులు వెంకటస్వామి,వీపనగండ్ల మండల అధ్యక్షుడు మీసాల రాజశేఖర్,సీనియర్ నాయకులు తిరుపాల్ మాదిగ, తెలంగాణ దండోరా విద్యార్థి నాయకులు పాల్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.