కుక్కల దాడికి బాలుడు మృతి
రఘునాథపాలెం మార్చి 13(జనం సాక్షి)
మండల పరిధిలోని పుటాని తండా గ్రామపంచాయతీలో కుక్కల దాడికి బాలుడు మృతి చెందిన సంఘటన స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బానోతు రవీందర్ , సంధ్య దంపతులకు, చిన్న కుమారుడైన, బానోతు భరత్ ,(5) బాలుడు గ్రామంలో పిల్లలతో ఆడుతుండగా వీధిలో ఉన్న కుక్కలు, సాయంత్రం సమయంలో వీధి కుక్కలు ఆ బాలుడి పై దాడి చేశాయి. దాడి చేసిన అనంతరం స్థానికుల సమాచారంతో హుటాహుటిన, ఖమ్మంలోని, ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని గమనించిన వైద్యులు వెంటనే హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి తరలించాలని సూచించారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆర్టీసీ బస్సు నందు వెళుతుండగా సూర్యాపేట సమీపంలోని బస్సులోనే ఆ బాలుడు మరణించాడు. అక్కడ నుంచి ఆ బాలుడిని స్వ గ్రామానికి, తీసుకువచ్చి తల్లిదండ్రులు గ్రామ ప్రజలు అంత్యక్రియలు నిర్వహించారు. కుక్కల దాడికి మరణించిన ఆ బాలుడు ని చూసి గ్రామంలో విషాదఛాయలు, కలుముకున్నాయి, వీధిలో తిరుగుతున్న కుక్కలను చూసి గ్రామ ప్రజలు గ్రామ పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రామంలో ఉన్న కుక్కలను వెంటనే నియంత్రించే విధంగా కృషి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.