కృష్ణాజిల్లాలో హై అలర్ట్‌ – విజయవాడకు అదనపు బలగాలు

విజయవాడ, మే 27 (జనంసాక్షి):
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సిబిఐ విచారిస్తున్న నేపథ్యంలో ఆదివారం విజయవాడలో హై అలర్ట్‌ ప్రకటించారు. విజయవాడ నగరానికి మూడు అదనపు బలగాలను ఖమ్మం జిల్లా నుండి రప్పించారు. జగన్‌ అరెస్టు అయ్యే సూచనలు కనిపిస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగ్గయ్యపేట, కంకిపాడు, గన్నవరం, గుడివాడ తదితర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. అంతేకాక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. విజయవాడలోని ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలను మోహరించారు. విజయవాడలో జగన్‌కు సొంతబలగం, బంధువులు, ఆస్తులు ఉన్నందున స్థానికంగా పోలీసులు గట్టి భద్రతాచర్యలు చేపట్టారు.