కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన నలుగురి మృత దేహాలు వెలికితీత

కృష్ణా: పెనమలూరు మండలంలోని పెదపులిపాక గ్రామం వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురి విద్యార్థుల్లో నలుగురి మృత దేహాలను బయటకు తీశారు. కానూరుకు చెందిన 9 మంది ఈతకు వెళ్లగా అందులో ఆరుగురు గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన విద్యార్థులు రత్న, బాబు, ఫణి, పండు, సుర్య, రవితేజలుగా గుర్తించారు. వీరంతా పదో తరగతి లోపు విద్యారుథులు. మిగిలినవారు క్షేమంగా బయటపడ్డారు.