కెసిఆర్‌కు రజకుల కృతజ్ఞతలు
హైదరాబాద్,ఆగస్ట్13(జనం సాక్షి ): రజకుల అభివృద్ధికి నగరంలో ఎకరం స్థలంతోపాటు భవన నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ కేటాయించడం అభినందనీయమని పలుచోట్ల సిఎం కెసిఆర్‌కు అభినందనలు తెలుపుతున్నారు. పలుచోట్ల క్షీరాభిషేకాలు చేస్తున్నారు. కెసిఆర్ నిర్ణయంతో తమకు భరోసా పెరితగిందని రజకాభివృద్ధి సంస్థ జాతీయ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఎం.అంజయ్య అన్నారు.దోభిఘాట్లకు వాషింగ్ మెషీన్స్, సబ్సిడీపై కరెంట్ సరఫరా చేసే విషయంపై సీఎం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలన్నారు. నేటి వరకు రజకులకు ఏ ముఖ్యమంత్రీ ఇన్ని వరాలు కురిపించలేదని రజక సంఘాల నాయకులు అన్నారు.



