కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీరముష్టి సంఘాలు
హైదరాబాద్,ఆగస్ట్28(జనం సాక్షి): తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి తెలంగాణ వీర ముష్టి సంఘం నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. 36 సంచార జాతులు, కులాల అభ్యున్నతి కోసం ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి హైదరాబాద్ లో 10 ఎకరాల స్థలం, రూ.10 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు తమను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ తమకు అండగా ఉన్నారని తెలంగాణ వీర ముష్టి సంఘం ప్రధాన కార్యదర్శి వీరాస్వామి చెప్పారు. సంచార జాతులకు ప్రత్యేక భవన్ నిర్మిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే నెల 2న కొంగర కలాన్ లో జరిగే ప్రగతి నివేదన సభను విజయవంతం చేస్తామన్నారు.


