కేంద్రమంత్రి చిరంజీవి కాన్వాయ్‌లో ప్రమాదం
పశ్చిమగోదావరి: కేంద్రమంత్రి చిరంజీవి కాన్వాయ్‌లో అపశృతి చోటుచేసుకుంది. తణుకు మండలం దువ్వలో పర్యటించేందుకు వస్తున్న మంత్రి వాహన శ్రేణిలోని ఓ వాహనం రోడ్డుపై వెళ్తున్న బాలుడిని ఢికొంది, ఈఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలున్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.