కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కి బుద్ధ విగ్రహాన్ని బహుకరించిన విద్య కల్పన ఏకాంత్ గౌడ్…

కూకట్ పల్లి (జనంసాక్షి):చేవెళ్ల పార్లమెంట్ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ని శుక్రవారం మదినగూడ కినరా గ్రాండ్ లో శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పోరేటర్ మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మార్చా సెక్రెటరీ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్, లు మర్యాదపూర్వకంగా కలిసి మంత్రికి బుద్ధుడి ప్రతిమను బహుకరించారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గజ్జల యోగానంద్,రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి కాంచన కృష్ణ మేడ్చల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు,రంగారెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు నాగుల్ గౌడ్, కూకట్ పల్లి పార్ట్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి,హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షులు నవీన్ గౌడ్ , వివేకానంద నగర్ డివిజన్ సెక్రటరీ జితేందర్, షాలిని, తదితరులు పాల్గొన్నారు.