కొనసాగుతున్న సివిల్ సర్వీసెస్ ట్రేని అధికారుల విలేజ్ స్టడీ టూర్
జనం సాక్షి, మంథని : సివిల్ సర్వీసెస్ ట్రైనీ అధికారుల విలేజ్ స్టడీ టూర్ లో భాగంగా ఐదవ రోజు గురువారం షెడ్యూల్ ప్రకారం ఉదయం పూట మంథని మండలం నాగారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో గల మిషన్ భగీరథ ట్యాంక్ వద్ద శ్రమ దానం నిర్వహించారు. అనంతరం మంథని తహసీల్దార్ కార్యాలయం సందర్శించడం జరిగింది ధరణి పోర్టల్ పని తీరు, పహాని, రైతు బంధు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఇన్చార్జి తహసీల్దార్ ఎస్.గిరి ని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఆర్డిఓ వీర బ్రహ్మచారి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ అధికారులని మరియు అతిధులుగా వచ్చిన ఆల్ ఇండియా సర్వీసెస్ ట్రైనీ మహిళా అధికారులని శాలువాలతో సత్కరించడం జరిగింది . అనంతరం మండల ప్రజా పరిషత్ మంథని కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. ఎంపీడీవో రమేష్ గారు ట్రైనీ అధికారులకు ప్రభుత్వ పథకాల పనితీరు, ప్రజలకు చేరే విధానం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ ట్రెయిన్ అధికారులు అభిషేక్, అనీషా, జాగృతి గోయల్ ,సుజిత్ లక్ష్మీనారాయణ వర్మ తోపాటు ఎంపీడీవో రమేష్ , పంచాయతీ కార్యదర్శి అనిల్ తదితరులు పాల్గొన్నారు.