కోనేరులో పడి బాలుడి మృతి

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి మండలం దొండపాడులో రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఓబాలుడి కోనేరులో పడి మృతి చెందాడు. రవి (14) అనే బాలుడు ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు కోనేరులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు అందులో పడి వూహిరాడక మృతి చెందాడు. కోనేరులో ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.