కోమటిరెడ్డి బ్రదర్స్‌పై పాల్వాయి ఫైర్‌

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మండిపడ్డారు. ఓ సారి తెలంగాణ అంటాడు, మరోసారి జగన్‌ పార్టీలోకి వెళ్తానంటాడు అని ఎద్దెవా చేశారు. తెలంగాణవాది అయితే వైఎస్సార్‌ సీపీలోకి ఎట్ల వెళ్తాడని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీలోకి వెళ్లాలనుకున్నా ఆయన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ వెనక్కి తగ్గారని చెప్పారు. తెలంగాణ ద్రోహి అయిన కోమటిరెడ్డి ఇంటికి కేకే ఎలా వెళ్తారని ప్రశ్నించారు. వెంకట్‌రెడ్డికే క్లబ్‌లు, ఇసుక దందాలు ఉన్నాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గట్టిగా వినిపించారని తెలియజేశారు.

 

తాజావార్తలు