కోలా చెప్పేవన్నీ నిజాలే చంద్రబాబు

హైదరాబాద్‌: కోలా కృష్ణమోహన్‌ చెప్పేవన్నీ అవాస్తవాలేనని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. యూరో లాటరీ వచ్చిందని రూ.10 లక్షలు పార్టీ ఫండ్‌ ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. ఈరోజు ఆయన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవస్‌లో  మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలు చెప్పేధైర్యం లేక ఇతరులపై బురద  విసురుత్తున్నారని వ్యాఖ్యానించారు.  తనవని చెబుతున్న అకౌంట్ల వివారలపై  ఫిర్యాదు ఇవ్వవచ్చని  చంద్రబాబు తెలిపారు. అతడి మోసం తెలసిన వెంటనే ఆ డబ్బును కోర్టులో డిపాజిట్‌ చేసినట్లు చెప్పారు. ప్రజలను మభ్య పెట్టేందుకే సాక్షి ప్రయత్నిస్తోందని చంద్రబాబు విమర్శించారు. నేరాల వూబిలో చిక్కుకొని తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.