గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోపదో తరగతి  విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ

 వీణవంక మార్చి 3( జనం సాక్షి )వీణవంక  మండలం లోని   స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ తన తల్లి  జ్ఞాపకార్థం పదోవ  తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, జడ్.పి.హెచ్.ఎస్  పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎం ఇ ఓ విడపు శ్రీనివాస్ విద్యార్థులనుదేశించి మాట్లాడుతూ.కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనే  నానుడిని విద్యార్థులు నిజం చేయాలన్నారు. బాల్య దశలోనే విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, దృఢ సంకల్పం పట్టుదలతో విజయతీరాలను చేరేవరకు నిర్విరామ కృషి చేయాలన్నారు. క్రమం తప్పకుండా శ్రమిస్తే కష్టానికి తగు ఫలితం దొరుకుతుందన్నారు. “ప్రార్థించే పెదవుల కన్నా- సాయం చేసే చేతులు మిన్న” అన్న మదర్ తెరిసా సూక్తిని మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆచరణలో నిజం చేస్తుందన్నారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ    కరీంనగర్ జిల్లా అర్బన్, హుజురాబాద్ లో ఇల్లందకుంట లొ మండలాలలో, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మండలంలోని పలు పాఠశాలలకు పరీక్ష ప్యాడ్ లు పంపిణీ చేశారని ట్రస్ట్ సేవలను కొనియాడారు. విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి, ఉన్నత శిఖరాలకు ఎదిగిన తర్వాత మధురమ్మ ట్రస్ట్ వలె సమాజ హిత కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు కన్వీనర్ మామిడి బుచ్చయ్య, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్, ఉపాధ్యాయులు,వేణు,రవి కిరణ్,రాజశేఖర్, శ్రీనివాస్,జైపాల్ రెడ్డి, అరుణ శ్రీ,శాంత, విద్యార్థులు తోపాటు తదితరులు పాల్గొన్నారు.