గణేశ్‌ నిమజ్జనోత్సవాన్ని హెలికాప్లర్‌ ద్వారా హోంమత్రి, డీజీపీల ఏరియల్‌ సర్వే

హైదరాబాద్‌: భక్తు కోలాహలం మధ్య గణేశ్‌ నిమజ్జనోత్సవం హైదరాబాదులో ప్రశాంతంగా కొనసాగుతోందని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అనుకున్న సమయానికి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆమో తెలిపారు. మరోవైపు తెలంగాన మార్చ్‌ నెక్లెస్‌ రోడ్డులో నిర్వహించుకోవడానికి ఐకాస నేత కోదండరాంకు పోలిస్‌ కమిషనర్‌ లిఖిత పూర్వకంగా అనుమతి ఇచ్చినట్టు డీజీపీ దినేశ్‌రెడ్డి వెల్లడించారు. మార్చ్‌కు వచ్చేవారికి పెరేడ్‌ మైదానంలో పార్కింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు ఆయన చెప్పారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపి దినేశ్‌ రెడ్డి, శాంతిభద్రతల డీజీ హుడా, నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌ గణేశ్‌ నిమజ్జనోత్సవాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా వీక్షించారు.