గణేషునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఓల్డ్ సిటీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు
ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 2 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో ఓల్డ్ సిటీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం ఓల్డ్ సిటీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తొండల అనిల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కోరే మహేష్ పంజాల మహేష్ పంజాల రాజు తవిటి వెంకటేశ్వర్లు యాస శ్రీకాంత్ యాస గోవర్థన్ నాతి వినయ్ లోడి మహేశ్ శ్రీశైలం క్రాంతి వివేకానంద సోమేశ్వర్ సాయి టిల్లు దుర్గప్రసాద్ సన్నీ తదితరులు పాల్గొన్నారు