గద్వాల, మక్తల్‌లో నేడు చంద్రబాబు పాదయాత్ర

మహబుబ్‌నగర్‌: వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబునాయుడు నేడు గద్వాల, మక్తల్‌ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ధరూర్‌ మండలంలోని చిన్నపాడు చౌరస్తా -ఎంలోన్‌పల్లిక్రాస్‌ నుంచి యాత్ర ప్రారంభమై రేవులపల్లిక్రాస్‌, మనావు రంక్రాస్‌, చిన్నచింతరేవుల, నర్సన్‌దోడ్డి క్రాస్‌ నెహ్రు విగ్రహం మీదుగా జూరాల ప్రాజేక్టు పోలీసుస్టేషన్‌కు చేరుతుంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత అత్మకూరు మండలంలోని నందిమళ్ల క్యాంపునకు చంద్రబాబు చేరుకుంటారు.