గబ్బర్‌సింగ్‌ శతదినోత్సవాలు

హైదరాబాద్‌: ముషీరాబాద్‌ ఖషీష్‌ ఫంక్షన్‌హాల్‌లో ఈ రోజు మధ్యాహ్నం గబ్బర్‌సింగ్‌ శతదినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నూర్‌ మహమ్మద్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభావేదికపై భారీ కేకును కట్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభిమానుల సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. మెగా ఫ్యామీలీపై ఈ అభిమానం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంధ్య థియేటర్‌ మేనేజర్‌ రామారావు మాట్లాడుతూ గబ్బర్‌సింగ్‌ సినిమాకు కోటిరూపాయల కలెక్షన్‌ వచ్చిందన్నారు. రక్తదాన శిబిరంలో 150మంది అభిమానులు రక్తదానం చేశారు.